PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వము తీసుకొంటున్న చర్యలు ప్రశంసనీయం

1 min read

– వర్క్ అడ్జస్ట్మెంట్ వలన ప్రాధమిక పాఠశాల లు దెబ్బ తినకుండా చూడాలి – ఆప్తా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ర్టంలో వర్క్ అడ్జస్ట్మెంట్ వలన అనేక మంది సెకండరీ గ్రేడ్ టీచర్ లు సబ్జెక్టు ఎక్స్పర్ట్ లు గా ఉన్నత పాఠశాల లకు కేటాయిస్తున్నారు దీనివలన ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు భోధన సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి.ఈ విషయంలో ప్రభుత్వము తీసుకొంటున్న చర్యలు ప్రశంసనీయం. కోర్టు కేస్ లు వున్నాయనే కారణం తో తెలుగు మరియు హిందీ వారికి అదేశాలు ఇవ్వడం లేదు అందువలన ఉన్నతపాఠశాలలో విద్యార్థులు తెలుగు మరియు హిందీ భాష ల విషయంలో వెనుకబడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రభుత్వం వారు కోర్టు నుండి ప్రత్యేక అనుమతి తీసుకొని వారికి అవకాశాలు కల్పించి వలసిఉన్నది. ప్రస్తుతం వర్క్ అడ్జస్ట్మెంట్ వలన ప్రాధమిక పాఠశాల లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది.కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో వున్న అందరు సెకండరీ గ్రేడ్ టీచర్లకు అదేశాలు వచ్చిన పరిస్థితి ఏర్పడింది అందువల్ల అలాంటి పాఠశాలల్లో ప్రాధమిక విద్యాభోధన కుంటుపడకుండా మేర్జింగ్ సందర్భం లో ఉన్నత పాఠశాల కు తరలించిన సెకండరీ గ్రేడ్ టీచర్ లను వెంటనే మండల స్థాయి ప్రాధమిక పాఠశాల లో సర్దుబాటు చేయాలి.మరియు 1998 డి ఎస్ సి అభ్యర్ధుల కు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి, అవసరం అయిన చోట ప్రత్యేక డి ఎస్ సి ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ ల నియామకం చేపట్టాలి. విద్యా వ్యవస్థ లో ప్రాధమిక విద్య పునాది వంటిది, కాబట్టి విద్యా అనే భవనం పటిష్టంగా ఉండాలి అంటే ప్రాధమిక విద్య ను బలోపేతం చేయాలి అని కోరుతూ ఏ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు రాష్ర్ట విద్యా శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, రాష్ర్ట ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారికి మరియు రాష్ర్ట పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ సురేష్ గారికి వేరు వేరు గా తమ సంఘం తరుపున ప్రాతినిథ్యం సమర్పించడం జరిగినది.

About Author