భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా వ్యతిరేక సంకేతాలతో భారత స్టాక్ సూచీలు కూడ నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో భారీగా సూచీలు కరెక్షన్ కు గురయ్యాయి. బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్, పవర్ సెక్టార్లలో భారీ ఎత్తున అమ్మకాల వెల్లువ కొనసాగింది. సెన్సెక్స్ 1165 పాయింట్ల నష్టంతో 59978 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 358 పాయింట్ల నష్టంతో 17852 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1347 పాయింట్ల నష్టంతో 39527 వద్ద ట్రేడ్ అవుతోంది.