నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టపోయిన నేపథ్యంలో అదే దారిలో దేశీయ సూచీలు కూడ కదులుతున్నాయి. ఐటీ కంపెనీలపై చైనా కఠిన నిబంధనలు అమలు చేస్తుండటం, కరోన వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయి 55473 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ 46 పాయింట్ల నష్టంతో 16,516 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిప్టీ 415 పాయింట్ల నష్టంతో 35,677 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది.