లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించి.. అనంతరం లాభాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా వివిధ మార్కెట్లలో మిశ్రమం కదలికలు నెలకొన్నాయి. అమెరికా గత వారాన్ని మిశ్రమంగా ముగించగా.. ఇవాళ యూరప్ మార్కెట్లు నెగిటివ్ జోన్ లో కదులుతున్నాయి. చైనా నాలుగో క్వార్టర్ జీడీపీ గణాంకాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. దేశీయంగా పవర్, రియాల్టీ, ఆటో సెక్టార్లలో నెలకొన్న కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో ట్రేడ్ అవ్వడానికి దోహదపడ్డాయి. 1:15 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 61,302 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 18299 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ప్రధాని మోదీ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొననున్నారు. దీని పై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు.