భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలోనే భారీగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తరువాత మరింత అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అన్ని రంగాల షేర్లలోలనూ ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 872 పాయింట్లు కుప్పకూలి 58773 వద్ద ముగిసింది. తద్వారా 59వేల స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ కూడా 267 పాయింట్ల నష్టంతో 17490 వద్ద స్థిరపడింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్, రియల్టీ స్టాక్‌లలో సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది.