NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు న‌ష్టాల్లో ముగిశాయి. ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మై అనంత‌రం న‌ష్టాల్లోకి జారుకున్నాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు మిశ్ర‌మంగా క‌దులుతున్నాయి. అదే బాట‌లో భార‌త మార్కెట్లు కూడ స్వ‌ల్ప న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఐటీ, ప‌వ‌ర్, మెట‌ల్, పీఎస్ యూ బ్యాంకులు, క్యాపిట‌ల్ గూడ్స్ సెక్టార్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొన‌గా.. హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సెక్టార్ల‌లో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు దిగారు. బుధ‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 145 పాయింట్ల న‌ష్టంతో 57996 పాయింట్ల వ‌ద్ద‌, నిఫ్టీ 30 పాయింట్ల స్వ‌ల్ప న‌ష్టంతో 17322 వ‌ద్ద ట్రేడ్ అయ్యాయి.

                              

About Author