లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. రోజంతా ఊగిసలాట ధోరణిలో సాగాయి. అనంతరం వివిధ రంగాల్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్సియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొనుగోళ్ల జోష్ కనిపించింది. దీంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ 50- 61 పాయింట్ల లాభంతో 15,879 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 35,758 వద్ద ట్రేడింగ్ ముగించింది.