NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొన‌సాగాయి. నాలుగో రోజు కూడ సూచీల్లో బుల్ ర్యాలీ కొన‌సాగింది. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా క‌ద‌ల‌గా.. అదే బాట‌లో దేశియ సూచీలు అనుస‌రించాయి. ఒమిక్రాన్ భ‌యాలు ఉన్న‌ప్పటికీ .. త్రైమాసిక ఫ‌లితాలు పాజిటివ్ గా ఉంటాయ‌న్న అంచ‌నాతో సూచీలు నాలుగో రోజు కూడ ర్యాలీ తీశాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 518 పాయింట్ల లాభంతో 61135 వ‌ద్ద‌, నిప్టీ 18200 వ‌ద్ద ట్రేడింగ్ ముగించాయి. ఫారిన్ ఫోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు ఈక్విటీ మార్కెట్ల‌లోకి తిరిగి రావ‌డంతో సూచీల్లో బ‌ల‌మైన ర్యాలీ కొన‌సాగింది.

                                                

About Author