భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న సూచనలతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదన్నది రష్యా ప్రధాన డిమాండ్. మరోవైపు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో రష్యా పై ఒత్తిడి పెరిగి యుద్ద విరమణకు పూనుకోవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో 54647 వద్ద, నిఫ్టీ 331 పాయింట్ల లాభంతో 16345 వద్ద ముగిశాయి. ఒక్క మెటల్స్ సెక్టార్ తప్ప మిగిలిన అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిశాయి.