NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో క‌దులుతున్నాయి. ఉదయం భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేప‌టికే ఆరంభ లాభాలు ఆవిరి అయిపోయాయి. అనంత‌రం న‌ష్టాల్లోకి జారుకున్నాయి. మ‌ధ్యాహ్నం 1 గంట సమ‌యంలో స్వ‌ల్ప లాభాల్లోకి వ‌చ్చాయి. ప్రస్తుతం సూచీలు స్వల్ప లాభంతో క‌న్సాలిడేట్ అవుతున్నాయి. అంత‌ర్జాతీయంగా ఆసియా, అమెరికా, యూరోపియ‌న్ సూచీలు కూడ పాజిటివ్ గా క‌దులుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు అంత‌ర్జాతీయ సూచీల‌ను అనుస‌రించాయి. మ‌ధ్యాహ్నం 2:30 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 286 పాయింట్ల లాభంతో 55,606 స్థాయి వ‌ద్ద ట్రేడ్ అవుతుండ‌గా.. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 16,514 స్థాయి వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 109 పాయింట్ల స్వ‌ల్ప లాభంతో 35144 స్థాయి వ‌ద్ద క‌దులుతోంది.

About Author