లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ సూచీలు లాభాల్లో ముగిసాయి. రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. చైనాకు చెందిన ఎవర్ గ్రాండే కంపెనీ సంక్షోభంతో సూచీలు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. మధ్యాహ్నం యూరప్ మార్కెట్లతో పాటు యూఎస్ ఫ్యూచర్స్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ 514.34 పాయింట్ల లాభంతో 59,005.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 165 పాయింట్ల లాభంతో 17,562 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్ల స్వల్ప లాభంతో 37,235 వద్ద ముగిసింది.