లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ, పవర్, రియాల్టీ సెక్టార్లో కొనుగోళ్లతో సూచీలు లాభపడ్డాయి. అమెరికా, ఏసియా, యూరోపియన్ సూచీలు పాజిటివ్ గా కదిలిన నేపథ్యంలో భారత సూచీలు వాటిని అనుసరించాయి. నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 18,102 వద్ద, సెన్సెక్స్ 767 పాయింట్ల లాభంతో 60686 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 38,733 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి.