లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం పాజిటివ్ గా మొదలైన సూచీలు అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో సెంటిమెంట్ బలపడింది. వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఐటీ, రియాల్టీ, మెటల్ స్టాక్స్ ర్యాలీ కొనసాగుతోంది. సెన్సెక్స్ 11:42 నిమిషాల సమయంలో 895 పాయింట్ల లాభంతో 56717 వద్ద, నిఫ్టీ 268 పాయింట్ల నష్టంతో 16882 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 479 పాయింట్ల నష్టంతో 34918 వద్ద ట్రేడ్ అవుతోంది.