PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీం తీర్పుతో లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ముంబ‌యి: రుణ మార‌టోరియం కేసులో సుప్రీం తీర్పుతో స్టాక్ మార్కెట్ లాభాల బాట ప‌ట్టింది. ఉద‌యం స్వల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన నిప్టీ, బ్యాంక్ నిప్టీ.. అనంత‌రం భారీ అస్థిర‌త‌తో ముందుకు సాగాయి. ఒకానొక ద‌శ‌లో లాభాల నుంచి న‌ష్టాల వైపు ప‌య‌నించాయి. కానీ.. రుణ మార‌టోరియం కేసులో సుప్రీం వెలువ‌రించిన తీర్పు .. ముఖ్యంగా బ్యాంక్ ఇండెక్స్ అయిన బ్యాంక్ నిఫ్టీని లాభాల బాట ప‌ట్టించింది. దీంతో నిఫ్టీ కూడ లాభాల్లో ప‌య‌నించింది. వ‌డ్డీ మాఫీ, మార‌టోరియం గ‌డువు పొడిగింపు కేసుల్లో సుప్రీం స్పష్ట మైన తీర్పు ప్రక‌టించింది. కేవ‌లం వ‌డ్డీ మీద వ‌డ్డి మాత్రమే మాఫి చేస్తార‌ని, రుణ మార‌టోరియం గ‌డువు పొడిగించ‌లేమ‌ని తెలిపింది. ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో న్యాయ స‌మీక్ష చేయలేమ‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసిన వారికి స్పష్టం చేసింది. ఈ తీర్పు అన్ని బ్యాంకుల‌కు పాజిటివ్ అంశంగా మారింది. దీంతో అన్ని బ్యాంకులు తీర్పు త‌ర్వాత లాభాల్లో ప‌య‌నించాయి. ట్రేడింగ్ ముగిసే స‌రికి నిఫ్టీ 78 పాయింట్లు లాభ‌ప‌డి..14814 వ‌ద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 618 పాయింట్ల‌తో 34221 వద్ద ముగిసింది.

About Author