రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా వరుసగా రెండో రోజు సూచీలు నష్టాల బాటపట్టాయి. ప్రధానంగా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు కూడ సూచీలు నష్టపోవడానికి దోహదం చేశాయి. సెన్సెక్స్ 656 పాయింట్ల నష్టంతో 60098 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 17938 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 38041 వద్ద ముగిశాయి.