అనిశ్చితి మధ్య అటూ ఇటూ కదులుతున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో సూచీలు నష్టపోయాయి. అదేబాటలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కూడ కొనసాగుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమై .. ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి చేరింది. ఉక్రెయిన్, రష్యా అనిశ్చితి కొనసాగుతోంది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టాల నుంచి కొంత దిగిరావడం సూచీలకు కలిసొస్తుంది. 1 గంట సమయంలో సెన్సెక్స్ 70 పాయింట్ల స్వల్ప లాభంతో 55534 వద్ద, నిప్టీ 21 పాయింట్ల లాభంతో 16616 వద్ద ట్రేడ్ అవుతోంది.