NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊగిస‌లాట ధోర‌ణిలో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు ఊగిస‌లాట ధోర‌ణి ప్రద‌ర్శిస్తున్నాయి. ఉద‌యం ట్రేడింగ్ ప్రారంభం కాగానే.. న‌ష్టాల్లోకి వెళ్లిన ఇండెక్స్ లు, అనంత‌రం వివిధ స్థాయిల్లో స‌పోర్ట్ తీసుకుంటూ లాభాల దిశ‌గా ప‌య‌నించాయి. అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ఉన్న ధోర‌ణి భార‌త స్టాక్ మార్కెట్ లో కూడ క‌నిపిస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సోమ‌వారం మిశ్రమంగా క‌దులుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే భార‌త స్టాక్ మార్కెట్లో కూడ అనిశ్చితి నెల‌కొంది. ఉద‌యం 11.45 నిమిషాల స‌మ‌యంలో నిఫ్టీ- 94 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుండ‌గా… బ్యాంక్ నిఫ్టీ- 165 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. శుక్రవారం నాటి అధిక స్థాయిల వ‌ద్ద ఈరోజు నిరోధాన్ని ఎద్కుర్కొంటున్నాయి.

About Author