నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించింది. ఉదయం 10:30 నిమిషాల సమయంలో నిఫ్టీ – 78 పాయింట్లు నష్టపోయి 15496 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ – 220 పాయింట్లు నష్టపోయి.. 35121 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఆల్ టైం హై చేరుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ లో ప్రధానంగా హెడీఎఫ్ సి బ్యాంక్ కొంత నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఫలితంగా బ్యాంక్ నిఫ్టి అప్పర్ సైడ్ మూవ్ అవ్వడం లేదు. హెడీఎఫ్ సి బ్యాంకుకు ఉన్న చిన్నపాటి సమస్యలు తొలగిపోతే మరోసారి బ్యాంక్ నిఫ్టీ 37500 ఆల్ టైం హైని తాకవచ్చు.