చమురు వదిలిస్తున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం స్వల్ప నష్టలతో ప్రారంభమై అనంతరం మరింత దిగువకు జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ముడిచమురు ధరలు మరింత పెరగడం ద్రవ్యోల్బణ భయాలకు కారణమవుతున్నాయి. చైనా మినహా ఆసియా సూచీలన్నీ నష్టాలో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ మీటింగ్ పై అనిశ్చితి నెలకొంది. దీంతో ఆటో, స్థిరాస్తి, ఫైనాన్స్, హెల్త్ కేర్ , ఐటీ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.