భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. మార్చి 2020 తర్వాత ఈ స్థాయిలో సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. గత వారం నుంచి సూచీలు వరుస నష్టాలతో ట్రేడ్ అవ్వగా.. సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫెడ్ సమావేశం, ఒమిక్రాన్ వ్యాప్తి, రష్యా..ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. అమెరికా టెక్ స్టాక్స్ గత వారం రోజులుగా భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. 3గంటల 20 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 1514 పాయింట్ల నష్టంతో 57560 వద్ద, నిఫ్టీ 451 పాయింట్ల నష్టంతో 17165 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.