లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగు వెబ్ : భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్.. ఒక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. వివిధ కీలక రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 138 పాయింట్లు లాభపడి 52,975 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టి 32 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్లు లాభపడి 35,007 వద్ద ట్రేడింగ్ క్లోజ్ అయింది. జొమాటో ఐపీలో ఈరోజు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర 76 కాగా.. 52 శాతం ప్రీమియంతో 116 వద్ద లిస్ట్ అయింది. చివరకు 66 శాతం లాభంతో 126 వద్ద క్లోజ్ అయింది.