NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల దిశ‌గా స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: గ‌త కొన్ని రోజులుగా ఊగిస‌లాట ధోర‌ణి క‌న‌బ‌రిచిన స్టాక్ మార్కెట్.. సోమ‌వారం లాభాల్లో ప‌య‌నిస్తోంది. ఉద‌యం 10:30 నిమిషాల సమ‌యంలో నిఫ్టీ – 115 పాయింట్ల లాభంతో 14,935 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. 15000 మార్క్ నిఫ్టీకి ఎంతో కీల‌కం. ఈరోజు మ‌రోసారి 15 వేల మార్క్ ను నిఫ్టీ-50 తాకే అవ‌కాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 370 పాయింట్ల లాభంతో 33260 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంత‌ర్జాతీయంగా అమెరికా మార్కెట్లలో సానుకూల‌త‌, ఆసియ‌న్ మార్కెట్లు మిశ్రమంగా ఉండ‌టంతో భార‌త మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. లాక్ డౌన్ ఉండ‌ద‌ని కేంద్రం తేల్చడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. కేవ‌లం క‌రోన కేసులు మాత్రమే స్టాక్ మార్కెట్ లో కొంత అనిశ్చితికి కార‌ణ‌మైంది. కేసుల సంఖ్య త‌గ్గితే స్టాక్ మార్కెట్ దూసుకెళ్లే అవ‌కాశం ఉంది.

About Author