ఓ బి సి మహిళల వాటా తేల్చేంతవరకు పోరాటం ఆగదు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల : మహిళా రిజర్వేషన్ 33%బిల్లులో ఓ బి సి మహిళల వాటా తేల్చేంతవరకు పోరాటం ఆగదు ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు ఈ దేశంలో అనాదిగా మోసానికి గురవుతున్నది బీసీలే 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎవరి శాతం ఎంతో తేల్చకుండా ఈ రిజర్వేషన్ ఎవరికోసం చేసినట్టు కేవలం 12 శాతం ఉన్నవారు ఆర్థికంగా రాజకీయంగా బలపడి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో శాశ్వతంగా అగ్రవర్ణాల వారి మహిళలకు రాజకీయ పునాదులు బలంగా వేయడానికి పూనుకున్నారని అందుకే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాంలేదంటే మా ఓ బీసీల మహిళల వాటా ఎంతో చట్టసభల్లో తీర్మానం చేయండి. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో దాదాపు మూడు లక్షల 50 వేల మంది బడుగు బలహీన వర్గాలు ప్రాణాలర్పిస్తే ఆ ఫలాలు అనుభవిస్తున్నది మాత్రం అగ్రవర్ణాల వారు కొన్ని సామాజిక వర్గాల వారన్న సంగతి అక్షర సత్యంభారతదేశ హిందూదేశం అంటారు ఈ దేశంలో హిందువులుగా ఉన్నది అధికంగా బీసీలే మరి బీసీలకు జరుగుతున్నన్యాయం ఎక్కడ దేశంలో సగభాగానికి పైగా ఉన్న జనాభాకు 27% రిజర్వేషన్ మరి 12 శాతం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్ ఎలా కేటాయించుకుంటారు అధికారం మీ చేతుల్లో పెట్టాము కాబట్టిఎందుకంటే మీరు చెప్పే సంక్షేమ పథకాల పేర్లకు మీరు చెప్పే ఉచితాల మాటలకు మీరు చెప్పే చేతబడుల ఉపన్యాసాలను నమ్మి ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చి 12 శాతం ఉన్న మిమ్మల్ని నాయకులుగా చేసి 85% ఉన్నమేముబిక్షం ఎత్తుకోవాలా అని జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు మరియు బీసీ సంఘం ఎంప్లాయ్ విభాగం అధ్యక్షులు రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతి కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన జిల్లా అధ్యక్షులు పెరుగు శివ కృష్ణ.బీసీ సంఘం యువజన అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.