వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటం ఆగదు
1 min readలక్ష మంది వాల్మీకుల తో వాల్మీకి విజయ భేరీ సభ
రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్షులు బి లక్ష్మన్న
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేవరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అధ్యక్షులు బి లక్ష్మన్న హెచ్చరించారు. మంగళవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత ముఖ్యమంత్రుందరికి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఒక మాట అధికారం చేపట్టిన తర్వాత ఒక రకంగా మాట్లాడడం తప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇందు కోసం మంత్రాలయం నియోజకవర్గం లో త్వరలో లక్ష మంది వాల్మీకి లతో వాల్మీకి విజయభేరీ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్నిసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి జేఏసీ గా ఏర్పడి జేఏసీ అధ్వర్యంలో వాల్మీకి విజయభేరీ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. వాల్మీకి మేము గత 40 సంవత్సరాలుగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అందరికీ ముఖ్యమంత్రి లకు వాల్మీకి/బోయల స్థితిగతులకు వివరిస్తూ వాల్మీకిలను ఎస్టీ లుగా గుర్తించాలని విన్నవించుకున్నా ఎట్టకేలకు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో వాల్మీకి, బోయలకు ఎస్టీ లుగా గుర్తిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వాల్మీకి, బోయలకు ఎస్టీ బిల్లు కేంద్రంలో పెండింగ్లో ఉన్నదని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ వాల్మీకి/ బోయల ఎస్టీ బిల్లు ను ప్రవేశపెట్టి పాస్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు కర్నూలు బహిరంగ సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు . పలు బహిరంగ సభలో బిజేపి జాతీయ నాయకులు కూడా హామి ఇవ్వడం జరిగిందన్నారు . ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకులను విభజించి పాలిస్తున్నారని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయగోదావరి జిల్లాలో తో కలిపి మొత్తం 5 ఉమ్మడి జిల్లాలకు ఎస్టీలు గాను మిగిలిన 8 ఉమ్మడి జిల్లాలోని వాల్మీకులను బీసీలుగా పరిగణిస్తున్నారన్నారు. వాల్మీకుల గలం వినిపించడం కోసం ఈ సభను నిర్వహిస్తున్నట్లు లక్ష్మన్న తెలిపారు ఈ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు బోయలు ఐక్యత కోసం జరుగుతుందని లక్ష్మణ తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జగాపురం ఈరన్న మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్ని ఎన్నికల అప్పుడు మాత్రం వాల్మీకులను బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని హామీ ఇస్తారు గానీ ఎవరు అమలు పరచడానికి కృషి చెయ్యకపోవడం దారుణమన్నారు త్వరలో అందరూ నాయకులు కలిసి వారి అమూల్య సలహాలు తీసుకొని వాల్మీకులు బోయల విజయభేరి సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో బివి రవిచంద్ర, వెంకటేశు, దుల్లయ్య తదితరులు ఉన్నారు.