సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదు
1 min readసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య స్పష్టం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న అంగన్వాడి వర్కర్స్ పోరాటం సమస్యలు పరిస్కరమయ్యేంత వరకు ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య స్పష్టం చేశారు.శుక్రవారం నాటికి అంగన్వాడీల సమ్మె నాల్గవ రోజు జరుగుతున్న సందర్భంగా శిబిరాన్ని సందర్శించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి రామచంద్రయ్య , సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య , రాష్ట్ర నాయకులు శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు పి రామచంద్రయ్య దీక్ష శిబిరంలో మాట్లాడుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని సమ్మెను నిర్వీర్యం చేయడానికి సచివాల సిబ్బంది ద్వారా ప్రయత్నం చేస్తున్నాడని,అంగన్వాడీలపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు వేతనం అదనంగా ఇస్తానని చెప్పిన హామీని 19వేలు ఇచ్చి నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, బెనిఫిట్స్ అంగన్వాడీలకి వర్తిస్తుందని తెలియజేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనంతో కూడిన జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి జీతాలు పెరిగేంతవరకు మీ ఉద్యమాన్ని కొనసాగించాలని దానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ, సంపూర్ణ మద్దతుతెలియజేస్తామని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు సుదీర్ఘ పాదయాత్రలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చకుండా బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటని అన్నారు. బెదిరింపుల ద్వారా ఉద్యమాల్ని ఆపలేరని, సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ డిహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.గురుదాసు, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం రంగన్న, ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు బి మాదన్న ,ఉపాధ్యక్షులు ఎం రాజప్ప ,నాగిరెడ్డి ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.