గిన్నెధరిలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ, తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలితో రెండు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. . ఉత్తరాది రాష్ట్రాల నుంచి అతిశీతల గాలులు దక్షిణాదికి వీస్తున్నాయి. ఈశాన్య దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. మరో వారం రోజుల వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న చెప్పారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో మంగళవారం రికార్డుస్థాయిలో 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నమోదైన అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రత ఇది రెండోసారి కావటం గమనార్హం.