PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్యూలైన్లను పరిశీలించిన ఆలయ ఈవో

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రం జరిగే కార్తిక మహోత్సవాల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న దర్శించుకుంటారు భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈవో లవన్న మరియు ఆలయ ఇంజనీర్ క్యూకాంప్లెక్స్, భద్రతా విభాగాలతో కలిసి దర్శనం క్యూలైన్లను, ఆర్జితసేవాక్యూలైన్లను, దర్శనం మరియు ఆర్జితసేవా కౌంటర్లను, విరాళాల సేకరణ కేంద్రం, లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలు మొదలైన వాటిని పరిశీలించారు.అదేవిధంగా కార్తీకదీపారాధన ఏర్పాట్లకు సంబంధించి గంగాధర మండపం, ఉత్తర శివవీధి ద్వారా శివాజీ గోపురం వెలుపలి ప్రాంతం, లక్షదీపోత్సవం. పుష్కరిణి హారతి కార్యక్రమాలు. నిర్వహించబడే పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రస్తుతము అమలులో ఉన్నట్లుగానే కార్తీకమాసంలో సర్వదర్శనం (ఉచితదర్శనం)తో పాటు..శ్రీఘ్రదర్శనం అతిశీఘ్ర దర్శనం. టికెట్లు భక్తులకుఅందుబాటులో ఉంటాయి.స్పర్శదర్శనం ( రూ.500/-ల రుసుముతో). అందుబాటులో ఉంటుంది. రద్దీరోజులలో రూ.500/-ల దర్శనం టికెట్లకు కూడా స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.అదనపు టికెట్ల కౌంటర్లను ఆర్జిత సేవా శ్రీఘ్రదర్శనం అతిశీఘ్ర దర్శనం. టికెట్ల ఒక్కొక్కటిగా పెంచారు.భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా తగినన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఇబ్బంది పడకుండా దర్శనం వేళలు, దర్శనానికి పట్టే సమయం మొదలైన సమాచారాన్ని ఆలయప్రసారవ్యవస్థ ద్వారా నిరంతరం భక్తులకు తెలియజేయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.ముఖ్యంగా దాతలు పథకాలకు రూ.50,000/-లు లేదా 1,00,000/-లు చెల్లించినప్పుడుఆయా నిర్థిష్ట వేళలో ప్రత్యేక దర్శనం కల్పించాలన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన లడ్డు ప్రసాదాలను తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న 7 లడ్డు విక్రయ కౌంటర్లతో పాటు అదనంగా మరో 4 అదనంగా కౌంటర్లుఏర్పాటు చేయనున్నారుఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటుండాలని సంబంధిత అన్ని విభాగాల పర్యవేక్షకులను ఆదేశించారు.
కార్తీక దీపారాధన ఏర్పాట్లు : గంగాధర మండపం వద్ద భక్తులు దీపారాధనలు చేసుకునే వీలుగా తగినన్నీ ఐరన్ స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.అదేవిధంగా ఉత్తర శివవీధిలో ( మాడవీధి) భక్తులు పూజించుకునే వీలుగా ఉసిరిక చెట్లను (ఉసిరిక చెట్ల కుండీలను) ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 50 చెట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యానవన విభాగాన్నిఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇంజనీర్ సిబ్బంది మరియు ఆలయ అన్ని విభాగాలు అధికారులు పాల్గొన్నారు.

About Author