PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడవరోజు ప్రజా ఆశీర్వాద యాత్ర విజయవంతం..

1 min read

స్వాగతం పలికిన సర్పంచ్ చల్ల చక్రధరరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : మూడవ రోజు జానంపేట పంచాయతీ ప్రకాష్ నగర్ లో ప్రజా ఆశీర్వాద యాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ఘన స్వాగతం పలికిన సర్పంచ్ చల్ల చక్రధర్ రావు రమాదేవి ముందుగా ఎమ్మెల్సీ  షేక్ సాబ్జీ మృతికి సంతాపంగా వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గ్రామమంతా సందడి వాతావరణంలో హుషారుగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ప్రకాష్ నగర్ ప్రజలుముందుగా ఎమ్మెల్యే  ప్రకాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆనంతరం గ్రామ దేవత దుర్గమ్మను దర్శించుకుని, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న పలువురి ఇళ్లకు భూమి పూజ చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేసి, ఏదైనా అవసరం ఉంటే తెలియజేయాల్సిందిగా వారికి భరోసా ఇచ్చారు.ప్రజా ఆశీర్వాద యాత్రకు గుర్తుగా ప్రకాష్ నగర్ లో ప్రజలతో కలిసి మొక్కలు నాటి విజయరాయి కి తన పాదయాత్రను కొనసాగించారు.విజయరాయికి విచ్చేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కి ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.అక్కడ ఏలూరు ఎంపీ  కోటగిరి శ్రీధర్  మరియు జెడ్పీ చైర్మన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ప్రజా ఆశీర్వాద యాత్రలో అడుగులు కలుపుతూ పాదయాత్రలో భాగం అయ్యారు.అందరూ కలిసి గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుని అక్కడి నుండి గ్రామంలో పాదయాత్ర చేశారు.ఎంపీ కోటగిరి శ్రీధర్  మాట్లాడుతూ, 2019 వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార గీతం వింటూ నడుస్తున్నామని, అందులో చెప్పిన ప్రతి మాట సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పూర్తి చేసి, ఆయన ప్రతినిధులుగా మేము తలెత్తుకొని మీ దగ్గరకు వచ్చే లాగా చేశారని అన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సీఎం  ఆశయాలకు అనుగుణంగా ప్రతీ గ్రామాన్ని సందర్శించి, ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను కనుక్కొని మరీ తీరుస్తున్నారని చెబుతూ,  ఇప్పుడు ఇక్కడి గ్రామాల ప్రజల్లో, గతంలో లాంటి భయం లేదని, భవిష్యత్ పై మంచి ఆశ కలగడమే కాకుండా వాటిని తీర్చుకునేందుకు జగనన్న ప్రభుత్వం మీకు అండగా ఉందని ఎంపీ  పేర్కొన్నారు. విజయరాయి ప్రభుత్వ పాఠశాలలో మన బడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు మరియు గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మధ్యాహ్న భోజనానికి గాను పాదయాత్రకు విరామం ఇచ్చారు.

About Author