NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల దాహం తీర్చలేని అభివృద్ధి ఒక అభివృద్ధే నా?

1 min read

బుగ్గనను సూటిగా ప్రశ్నించిన  బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరావు యాదవ్

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: రాష్ట్రంలోనే మోడల్ గా డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఒకసారి పల్లెల్లోకి వచ్చి చూడండి దాహం దాహం అని అలమటిస్తున్నారు నీ జోబి నింపుకోవడానికి నీ అనుచరులు బాగుపడడానికి కొన్ని కాంట్రాక్ట్ పనులు చేసినంత మాత్రాన రోడ్లు వేసినంత మాత్రాన పట్టణాల్లో మీ జేజినాయన పేరు పెట్టుకున్నంత మాత్రాన విగ్రహాలు నిర్మించినంత మాత్రాన అది అభివృద్ధి అయిపోదు ఒక్కసారి గ్రామాలకు రండి ఏ గ్రామంలో చూసినా తాగునీటి ఎద్దడి తాండవం ఆడుతుంది. ప్యాపిలి మండలంలో పర్యటించిన వై నాగేశ్వరావు యాదవ్   గ్రామాలు హనుమంతరాయన పల్లె, అలే బాధ తండా, గ్రామాలలో తాగునీటి కోసం ప్రజల అష్ట కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ నీకు కనబడవా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజలకు కావలసిన సౌకర్యాలు తీర్చి అప్పుడు గ్రామాలకు హంగులు ఏర్పరచండి ప్రజలు కనీస అవసరాలకే మీరు మసిపూసి మారేడు కాయ చేసిన విధంగా పట్టణాలలో కనపడే విధంగా రోడ్లు వేసి మీరు అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు ఆరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో శాంక్షన్ చేయబడ్డ చెరువులని ఈరోజు పని చేసి మీరు అది అభివృద్ధి చెపుకుంటున్నారు. సిగ్గుందా మీ తాత ప్యాపిలికి ఏమి చేశారని ఆయన విగ్రహం పెట్టారు సిల్క్ ఫారం కి ఒక రాయి ఇటుక పీర్చినారా మీ తాతగ మీ తాత  పేరు పెడతావా ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి లేదంటే ప్రజలే నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అని నాగేశ్వరావు యాదవ్  తెలిపారు.

About Author