త్వరలో మూడు రాజధానులు ఖాయం
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీలో మూడు రాజధానులతో పాలన జరగడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరినట్టు సజ్జల తెలిపారు. రాష్ర్టంలో పెండింగ్ సమస్యలు, అభివృద్ధి అంశాల మీద కేంద్ర మంత్రులతో సీఎం చర్చించినట్టు ఆయన వెల్లడించారు. ప్రత్యేకంగా విభజన సమస్యల మీద కేంద్ర మంత్రులతో చర్చించినట్టు చెప్పారు. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు వంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం జగన్ చర్చించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.