NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

1 min read

సాయికుమార్ త‌న‌యుడు ఆది, సుర‌భి జంట‌గా న‌టించిన ‘శశి’ సినిమా ట్రైల‌ర్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిలీజ్ చేశారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ తో పాటు హీరో ఆది, హీరోయిన్​ సుర‌భి, ద‌ర్శక నిర్మాత‌లు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిశారు. ‘శశి’ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేయాల‌ని సాయికుమార్ కోర‌డంతో… ప‌వ‌న్ విరామ సమ‌యంలో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ‘మ‌నం ఏదైనా సాధించాల‌నుకున్నప్పుడు ముందు మ‌న బ‌ల‌హీన‌త‌లు గెల‌వాలి’ అంటూ సాగే డైలాగ్ సినిమాలో ఇప్పటికే ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేసింది. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమా నిర్మించింది. శ్రీనివాస్ నాయుడు న‌డికంట్ల ద‌ర్శక‌త్వం వ‌హించారు. అరుణ్ చిల‌వేరు సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

About Author