క్లిస్టమైన యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతం
1 min read– డాక్టర్ గురు ప్రకాష్,
పల్లెవెలుగు వెబ్ హైదరాబాదు: క్లిస్టమైన యాంజియోప్లాస్టీని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడలో విజయవంతంగా నిర్వహించినట్లు యశోద ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రకాష్ పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం నగరంలోని బళ్లారి చౌరస్తా,హోటల్ సూరజ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గురుప్రకాష్ వివరాలు వెల్లడించారు.అమేజింగ్ మరియు చికిత్స విధానాలతో నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డకు చెందిన సుబ్బలక్ష్మమ్మ అనే మహిళా రోగి గుండె రక్తనాళాల్లో ఉన్న క్లిష్టమైన అడ్డంకిని విజయవంతంగా తొలిగించడం జరిగిందని అన్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళాలలో ఒకటైన ఎడమ సర్కిల్స్ అక్టరీలో సంక్లిష్టమైన పిటిసిఎ (PTCA) విజయవంతంగా నిర్వహించడంతో కర్నూలుకు చెందిన మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. పిటిసిఎ అనేది గుండె రక్తనాళాలలో ఉన్న అడ్డంకిని తొలగించటానికి స్టంట్ను అమర్చే ఒక నాన్- ఇన్వాసివ్ టెక్నిక్, “రోగి గుండె ఆరోగ్యానికి కీలకమైన రక్తనాళం అయిన ఎడమ సర్కమ్డ్స్ ధమనిలో అడ్డంకి ఏర్పడిందన్నారు. మరియు సవాలు చేసే భాగం ఏమిటంటే, ఆ అడ్డంకి చాలా కఠినమైన కాల్షియమ్ తో ఏర్పడింది.దానిని కర్నూలులో రెండుసార్లు యాంజియోప్లాస్టీ ద్వారా తొలగించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.అప్పుడు వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాదులోని యశోద ఆసుపత్రిని సందర్శించమని రోగికి వైద్యులు సలహా ఇచ్చారు.యశోద హాస్పిటల్, డాక్టర్ గురు ప్రకాష్,రోగి ఎడమ సర్కమ్ప్లెక్స్ రక్తనాళం నుండి కాల్సిఫైడ్ అడ్డంకిని తొలగించడానికి రైడ్లైనర్ మైక్రో-కాథెటర్ & గ్రాండ్ స్లామ్ గైడ్ వైర్తో సహా అడ్వాన్స్ ఇంటర్వెన్షనల్ టూల్స్ ను ఉపయోగించి చికిత్సను విజయవంతం చేశామన్నారు.యశోద హార్ట్ ఇన్స్ టిట్యూట్ లో అధునాతన క్యాట్లాబ్,అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీలైన ఎఫ్.ఎఫ్.ఆర్, ఐవియుఎస్,ఓసిటి అధునాతన ఐసియులు,ఈసిఎంఓలు ఉన్నాయని, ఇవి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలలో రోగులకు సంరక్షణను అందించడానికి ఉపయోగపడుతాయని డాక్టర్ గురు ప్రకాష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్,సోమాజిగూడ ప్రాంతీయ సమన్వయ కర్తలు వెంకటాద్రి,రమణ, రాజారెడ్డి,బాదిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
యశోద గ్రూప్ గురించి :
యశోద గ్రూప్ అప్ హాస్పిటల్స్ 3 దశాబ్దాలుగా విభిన్న వైద్య అవసరాలు కలిగిన వ్యక్తుల కోసం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తోంది.వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను. అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. యశోద హాస్పిటల్ సోమాజిగూడ, సికింద్రాబాద్,మలక్ పేట్ మరియు హైటెక్ సిటీలలో 4000 పడకలతో 4ఇండిపెండెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి.నాణ్యత మరియు సేవలో శ్రేష్ఠతో ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.సమావేశం లో యశోద ప్రాంతీయ సమన్వయ కర్తలు వెంకటాద్రి,రమణ,రాజారెడ్డి పాల్గొన్నారు.