PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భద్రత లేని భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 27/2024 గృహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ, పత్తికొండ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం చక్రాల రాస్తా నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కరపత్రాలు రైతులకు పంచుతూ, ర్యాలీ చేపట్టారు. అనంతరం  ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదుల ను ఉద్దేశించి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రజల ఆస్తులకు  భద్రత లేని భూ హక్కుల చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే పేరుతో న్యాయస్థానం సివిల్ కోర్టు పరిధి కేసులన్నింటినీ ట్రిబ్యునల్ పేరు మీద జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సివిల్ కేసులన్నీ ట్రిబ్యునల్ లో వేసుకొని కేసు వేసిన వ్యక్తికి అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకి అప్పీల్వి  పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చిందని అన్నారు.ఈ చట్టo వలన సామాన్యులకు  చాలా నష్టం జరుగుతుందని తెలిపారు . కావున ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని  కోరారు. రద్దు చేయని పక్షంలో పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి రంగస్వామి, సహాయ కార్యదర్శి దామోదర ఆచారి,  మహేష్, రవి కుమారు, సీనియర్ న్యాయవాదులు చంద్రశేఖర నాయుడు, మైరాముడు, బాల భాష, కాశీ విశ్వనాథ, మధుబాబు, వాసుదేవ నాయుడు, నరసింహులు, హరికృష్ణ చారి, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖరు క్రాంతి, మధు, కబీర్, రమేష్ బాబు, లక్ష్మన్న, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.     

About Author