NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాలిచ్చే త‌ల్లుల‌కు వ్యాక్సిన్ సుర‌క్షితం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చాక‌..వ్యాక్సిన్ వేసుకోవ‌డం పై ప్రజ‌ల్లో అనేక అపోహ‌లు ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా పుకార్లు పుడుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజ‌లు వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప‌లు వ‌దంతుల‌కు స్పష్టత‌నిచ్చింది. వ‌దంతులు న‌మ్మెద్దంటూ ప్రజ‌ల‌కు పిలుపునిచ్చింది. పాలిచ్చే త‌ల్లుల‌కు వ్యాక్సిన్ సుర‌క్షిత‌మ‌ని జాతీయ నిపుణుల బృందం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చని సిఫార‌సు చేసింది. వ్యాక్సిన్ వేసుకునే ముందు.. త‌ర్వాత కూడ పాలిచ్చే త‌ల్లుల‌.. పిల్లల‌కు పాలివ్వొచ్చ‌ని, ఆపాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ పూర్తీగా సుర‌క్షిత‌మైన‌ద‌ని, అనేక ప్రయోగాల తర్వాతే వ్యాక్సిన్ ఆమోదించ‌బ‌డి ఉంటుంద‌ని తెలిపింది.

About Author