PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ `ఆర్` విలువ పెరిగింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోవిడ్ విషయంలో భారత దేశ ఎఫెక్టివ్ రీప్రొడక్షన్ నంబర్ (R) పెరిగినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు వెల్లడించారు. ఈ మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోందనడానికి ఇది సంకేతమని తెలిపారు. జనవరి నుంచి పరిశీలించినపుడు R విలువ మొదటిసారి 1 ని దాటినట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారత దేశ R విలువను పరిశీలిస్తున్న మ్యాథమెటీషియన్ సిటబ్ర సిన్హా మాట్లాడుతూ, కొద్ది వారాల నుంచి మన దేశ R విలువ నిలకడగా పెరుగుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 12-18 మధ్య కాలంలో ఇది 1.07గా ఉందన్నారు. ఏప్రిల్ 5-11 మధ్య కాలంలో ఇది 0.93 అని పేర్కొన్నారు. జనవరి 16-22 మధ్య కాలంలో ఇది 1.28 ఉండేదన్నారు. ఈ విలువ పెరగడానికి కారణం కేవలం ఢిల్లీ మాత్రమే కాదని, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కూడానని చెప్పారు.

                                           

About Author