వేదవతి ప్రాజెక్టును 8టిఎంసిల సామర్థ్యంతో నిర్మించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: వేదవదినది ప్రాజెక్టును 8టిఎంసిల సామర్థ్యంతో నిర్మించాలని నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని ఆస్పరి మండలాన్ని ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి మారప్ప అధ్యక్షతన చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య గారు రైతు సంఘం ఆలూరు మండల కార్యదర్శి ఓతురప్ప వారు మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టు 8 టీఎంసీల సమర్థంతో నిర్మించాలని ఆస్పరి మండలాన్ని వేదవతి నది ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని 80 వేల ఎకరాలు కు సాగునీరు అందించాలని 253 గ్రామాలకు తగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు పూర్తయినందుకు పోరాటాల ఆగవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రంగన్న రైతు సంఘం నాయకుడు కృష్ణయ్య అబ్దుల్లా సిపిఐ నాయకులు సలాం సాబ్ హినహిత ఆరిప్ నూర్ భాషా ఫరూక్ ఈరాన్న తదితరులు పాల్గొన్నారు.