రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయం.. కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readబెస్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. ఆయన కార్యాలయంలో నిర్వహించిన కర్నూలు నియోజకవర్గ బెస్తల ఆత్మీయ సమావేశంలో టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు దూరమయ్యాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 217 జీవోను రద్దు చేస్తామన్నారు. బెస్తల సంక్షేమం, అభివృద్ధి కోసం మంచి విధానాలు అమలు చేస్తామని తెలిపారు. కర్నూల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తానని చెప్పారు. ప్రధానంగా త్రాగునీటి సమస్యను ఐదేళ్లలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకొని తాను రూపొందించిన 6 గ్యారెంటీలు ఐదేళ్లలో పూర్తిచేస్తానన్నారు. ప్రజలందరూ తప్పకుండా టిడిపికి ఓటు వేసి గెలిపించాలని టి.జి భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి ఆర్షద్, టిడిపి నాయకులు చేపల రమేష్, బెస్త సాధికార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చంద్రబోస్, ఫిషరీస్ స్టేట్ మాజీ డైరెక్టర్ నవీన్ కుమార్, జగన్, ముని, విజయ్, అర్జున్, పవన్, రాము, అశోక్, భాస్కర్, మునెమ్మ, వెంకటేశ్వర్లు, మధు, నర్సప్ప, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.టిడిపిలోకి చేరికలు .. బెస్తల ఆత్మీయ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ నగర అధ్యక్షులు కొతిమీర వెంకటేష్, వైసీపీ నేత జలగరి ఆనంద్‌లు వారి బృందాలతో కలిసి టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కష్టపడాలని వారితో చెప్పారు.