NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం తధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈనెల 13న జరిగే ఎమ్మల్సి ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి రామ గోపాలరెడ్డి విజయం తధ్యం అని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కే.ఈ. శ్యామ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  న్యాయవాదులతో సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి సీనియర్ న్యాయవాదులు కే సురేష్ కుమార్ , మైరాముడు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ కే యీ  శ్యామ్ బాబు గారు,సీనియర్ నాయకులు సాంబశివరెడ్డి గారు TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం  అశోక్ కుమార్ పాల్గొని టీడీపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి 1 నెంబర్ ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులను అభర్తించారు.  ఈ కార్యక్రమానికి న్యాయవాదులు రమేష్, బాలబాష జటాంగీరాజు ,అరుణ్ కుమార్ ,నారాయణ స్వామి,   సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.అలాగే స్థానిక సెయింట్ జోషఫ్స్ పాటశాలలో స్కూల్  స్టాఫ్  తో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లోక్‌నాత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, జరిగింది  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీ కే యీ  శ్యామ్ బాబు గారు,సీనియర్ నాయకులు సాంబశివరెడ్డి గారు TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం  అశోక్ కుమార్  భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారికి 1 నెంబర్ ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  నాయకులు జూటూర్ ఈశ్వరప్ప, మునినాయుడు, కృష్ణ, నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

About Author