NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛంద్రా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి

1 min read

పిజిఆర్ యస్ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్రా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలనీ జిల్లా కలెక్టరు  కె.వెట్రిసెల్వి అన్నారు.శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్  నుండి జిల్లా పంచాయతీ శాఖ అధికారి,జడ్పీ సీఈఓ, ఆయా మండలాల అధికారులు,ఆయా  పురపాలక సంఘాల కమీషనర్లులతో జిల్లా కలెక్టరు  కె.వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛంద్రా జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా గౌరవ ప్రధానమైన స్థానంలో ఉంచేందుకు,ప్రస్తుత పనితీరు బేరీజు వేసుకుని కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.పట్టణాలు, గ్రామాలతో పాటు మారుమూల గ్రామాల్లో కూడాస్వచ్ఛంద్రా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.ఖాళీ స్థలాలు కలిగిన యజమానులు స్వచ్ఛందంగా చెత్తను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు బాగా పనిచేసేలా  చూసి నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అంగన్వాడి సెంటర్లు,ప్రభుత్వ హాస్పిటల్స్, పర్యాటక కేంద్రాలు, బస్టాండులు, తదితర ప్రాంతాలలో స్వచ్ఛంద్రా కార్యక్రమాలు బాగా జరగాలన్నారు.డోరు టూ డోరు చెత్త సేకరణ కొన్ని చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని అవి తిరిగి రాకుండా చూడాలన్నారు.పట్టణ, గ్రామాలు మంచినీటి ట్యాంకులు క్రమం తప్పకుండా క్లీనింగు, మంచినీటి పరీక్షలు, క్లోరిన్లైజేషన్ చెయ్యాలని వీటికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లులో నమోదు చేయాలన్నారు.ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రిజిస్టర్లును పరిశీలన చేస్తానని స్పష్టం చేశారు.స్వచ్ఛంద్రా కార్యక్రమాలలో నూటికి నూరుశాతం ప్రగతి సాధించిన గ్రామ పంచాయతీలు, వార్డులు, నగరపాలక సంస్థల డివిజన్ గుర్తించి వారికి సన్మాన అభినందన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని చక్కని పరిష్కారాన్ని చూపించాలని అన్నారు.పరిష్కారం కాని సమస్యలు ఉంటే అర్జీదారునికి ఏ కారణం చేత సమస్యను పరిష్కారం చేయలేక పోతున్నామో అర్థమయ్యేలా వివరించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ,జిల్లా పరిషత్తు సిఇవో కె. భీమేశ్వరరావు, ఆయా మండలాలు,ఆయా  పురపాలక సంఘాలు నుండి కమీషనర్లు,డివిజనల్ పంచాయతీ శాఖ అధికారులు, డియల్డివోలు,యంపిడివోలు, ఈవోపిఆర్డీలు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *