PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మౌలానా అబుల్ కలాం చూపిన మార్గాలు అనుసరణీయం

1 min read

పట్టణ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: మౌలానా అబుల్ కలాం చూపిన మార్గాలు అందరికీ అనుసరణీయం కావాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాల్ నందు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, మైనార్టీల సంక్షేమ మరియు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలాన అబుల్ కలాం చిత్రపటానికి  ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్  విద్యాశాఖ మంత్రిగా పనిచేసి   తన జీవితకాలంలో విద్యారంగానికి చేసిన కృషిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. వారు విద్యా రంగములో చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఆజాద్ గ్రామీణ పేదలు మరియు బాలికలకు విద్య, వయోజన, అక్షరాస్యత, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత సార్వత్రిక ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, వృత్తిపరమైన శిక్షణతో సహా వివిధ రంగాలపై అబుల్ కలాం ఆజాద్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్ద పీట వేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా నంద్యాలలో 18 మున్సిపల్ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా, పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘనత వైయస్ఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసి వారి జీవితాలను మారుస్తున్నారన్నారు.  ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా అమ్మఒడి ద్వారా 15000 రూపాయలు అందిస్తున్నారన్నారు.  470 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా మొదటి సంవత్సరం క్లాసులను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆదర్శం తోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిందన్నారు.డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు.అనంతరం అతిధుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ డా.నౌమాన్, DCHS  డా. జఫ్రుల్లా, మూడవ పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ చంద్రశేఖర్, ఎంఈఓ బ్రహ్మం, సాయిరాం రెడ్డి, విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author