పెళ్లికి బ్రేక్ వేసింది
1 min readసినిమా డెస్క్: తమకు నచ్చిన హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారవుతున్నారంటే ఫ్యాన్స్ ఎంతో సంబరపడతారు. అలాగే మెహ్రీన్ పెళ్లి వార్త విన్న అభిమానులు కూడా ఎంతో హ్యాపీ ఫీలై ఆమెకి కంగ్రాట్స్ తెలిపారు. అయితే సడన్‌గా నిన్న నేను పెళ్లి చేసుకోను, మా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అంటూ షాక్ ఇచ్చింది మెహ్రీన్. ఆ విషయాన్ని తెలుపుతూ ట్వట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘‘మా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా. ఇది పూర్తిగా నా పర్సనల్ మ్యాటర్. మేమిద్దరం ఒకినొకరు హార్ట్‌ఫుల్‌గా గౌరవించుకుంటూనే విడిపోతున్నాం.. దయచేసి నన్ను అర్థం చేసుకుని గౌరవిస్తారని అనుకుంటున్నా.. ఇకముందు భవ్య ఫ్యామిలీ మెంబర్స్‌తో కాని ఫ్రెండ్స్‌తో కాని తనకు ఎలాంటి సంబంధం ఉండదు’’ అంటూ అందులో తెలిపింది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లికి సిద్ధమయ్యింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో పడింది. వారిద్దరికీఈ యేడాది మార్చి 12న నిశ్ఛితార్థం జరిగింది. ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. త్వరలోనే మా పెళ్లి అని అనౌన్స్ కూడా చేశారు. ఇక పెళ్లి కొద్ది రోజులు ఉందనగా మెహరీన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇక మీదట తన దృష్టంతా కేరీర్ మీదే అంటూ కూడా స్పష్టం చేసింది మెహ్రీన్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఆ తర్వాత ఎఫ్2, కవచం, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మెహ్రీన్ ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ , మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీస్ చేస్తోంది.