కళ్యాణం కమనీయం..చెన్నకేశవుని రథోత్సవం
1 min read
రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి..
భారీగా హాజరైన ప్రజానీకం
రూరల్ సీఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్త్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో సోమవారం రా.7 గంటలకు జరిగిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భూమా కృష్ణమోహన్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరై దేవాలయంలో మరియు రథోత్సవం దగ్గర ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.రథోత్సవాన్ని భక్తాదులు ఇరువైపులా తాడుతో పట్టుకొని పాత తహసిల్దార్ కార్యాలయం వరకు తిరిగి దేవాలయం వరకు రథోత్సవాన్ని తీసుకువచ్చారు.ఉదయం నుండే దేవాలయంలో గ్రామ ప్రజలు బంధువులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తిరుణాల సందర్భంగా గ్రామం ప్రజలతో కిక్కిరిసిపోయింది. రథోత్సవాన్ని పూలతో ప్రత్యేక అలంకరణతో చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పీరు సాహెబ్ పేట,చింతలపల్లి, కాజీపేట మరియు గ్రామ ప్రజలు తిలకించారు.రథోత్సవంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్ఐ లు ఓబులేష్, తిరుపాలు,లక్ష్మీనారాయణ తదితర సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

