PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రం అందజేసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కోడుమూరు పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. రామకృష్ణ ( PC–3560 ) ను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు మంగళవారం ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. కోడుమూరు పట్టణంలో కున్నూరు గ్రామానికి చెందిన సిద్దన్న హత్య గురించి ఆ కేసు విషయంలో ఆసక్తి కనబరచి సమాచారాన్ని సేకరించి, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కనుగొనడంతో పాటు 10 మంది నిందితుల అరెస్టు విషయంలో విధులపట్ల అంకితభావం, నిబద్ధతతో చేసిన కృషికి కానిస్టేబుల్ కె. రామకృష్ణ ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. పోలీసు సిబ్బందిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సంధర్బంగా వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్ కె. రామకృష్ణ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ జేశారు.

About Author