బాలబాలికల సంక్షేమానికే ప్రాధాన్యం
1 min readజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు
పల్లెవెలుగు: జిల్లాలోని వసతి గృహాలలో చదివే బాలబాలికల సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిస్తామన్నారు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు. గురువారం జిల్లాలోని పలు సంక్షేమ గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని బి క్యాంపులోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బాలికలు,బాలుర వసతి గృహాలను పరిశీలించారు. అదేవిధంగా జువెనైల్ హోము, వేదాస్ షెల్టర్ హోంను తనిఖీ చేశారు. వసతి గృహాల్లోని బాలబాలికలకు వడ్డించే ఆహారం నాణ్యత,సౌకర్యాలు, భవనం పరిస్థితి , వార్డెన్ల వ్యవహార శైలి తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని ..భయపడాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సూటిగా చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు… జువెనైల్ హోము, వేదాస్ షెల్టర్ హోం లో చట్టం, లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందుట, తదితర అంశాలపై వివరించారు.