NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల సంక్షేమమే ధ్యేయం..

1 min read

– కేడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్​ ఎస్​. మహాలక్ష్మి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రైతుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, అన్నదాతల అభ్యన్నతికి నిరంతరం కృషి చేస్తామన్నారు కేడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్​ ఎస్​. మహాలక్ష్మి. వైసీపీ కర్నూలు నగర అధ్యక్షులు రాజావిష్ణువర్ధన్​ రెడ్డి సతీమణి ఎస్​. మహాలక్ష్మి శుక్రవారం కేడీసీసీ బ్యాంకు చైర్​ పర్సన్​గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్​ పర్సన్​ మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు, కౌలు రైతులకు పథకాలు వర్తింపజేయడం, సకాలంలో రుణాలు అందించడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు.

అభినందనల వెల్లువ…
K.D.C.C. బ్యాంక్ చైర్​ పర్సన్​గా బాధ్యతలు స్వీకరించిన ఎస్​. మహాలక్ష్మికి వైసీపీ శ్రేణులు, కేడీసీసీ బ్యాంకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్. బాల ఈశ్వర రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య, రాష్ట్ర బిసి సెల్ నాయకులు రియల్ టైం నాగరాజు యాదవ్, దేవపూజ ధనుంజయ్ ఆచారి, ఎం.ఆర్.ఐ. విభాగ నాయకుడు మారాం కిరణ్ కుమార్ రెడ్డి, నగర సేవదల్ అధ్యక్షుడు మల్లికార్జున, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు కటారి సురేష్, 49 వ వార్డు కార్పొరేటర్ సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మున్నా, ఎస్.సి.సెల్ నాయకుడు రవి బాబు,కర్నూల్ పార్లమెంట్ సోషల్ మీడియా అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి, సంజు, వేణు, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, KDCC బ్యాంక్ డైరెక్టర్లు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author