మాహిళా సంక్షేమమే జగనన్న ఆకాంక్ష..
1 min read– పగిడ్యాల మండల వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత సదస్సులో పాల్గొన్న ఎంఎల్ఏ ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : జగనన్న పాలనలో మహిళా సంక్షేమం వెల్లివిరుస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పగిడ్యాల లో జరిగిన మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను జగనన్న మాటనిలబెట్టుకున్నారన్నారు. వైఎస్ఆర్ ఆసరా మూడవ విడతలో పగిడ్యాల మండలంలోని 756 సంఘాలకు రూ 6.82 కోట్లు జమ మవుతోందన్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జగనన్న..పాదయాత్రలో జగనన్న మహిళల కష్టాలను కళ్లారా చూసి వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నార న్నారు.ఆసరా ,చేయూత,సున్నా ,ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అందచేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతానికి పైగా నెరవేర్చి చరిత్ర సృష్టించారన్నారు.న్యాయం, ధర్మం వైపున ఉన్న జగనన్నకు అండగా నిలవాలి..న్యాయం,ధర్మం వైపు జగన్ వైపున ఉన్నాయన్నారు.చంద్రబాబు పాలన అంతా మోసం దగా లుతో కూడుకున్నదన్నారు.ధర్మం వైపున ఉన్న జగనన్న కు అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. మహిళా సాధికారతలో దేశానికే సీఎం జగన్ ఆదర్శం.మహిళా సాధికారతలో దేశంలోనే సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.దిశ చట్టంతో మహిళలకు రక్షణగా నిలబడుచున్నారన్నారు. మహిళలకు అన్ని రంగాలలో అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం…మహిళలకు సీఎం జగనన్న చేస్తున్న మేలు మరువలేమంటూ పగిడ్యాల మండల మహిళలు సీఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.పొదుపు మహిళలకు ఆసరా మెగా చెక్ అందచేత.పగిడ్యాల మండలంలోని స్వయం సహాయక సంఘాలకు 756 మూడవ విడత క్రింద వైఎస్ఆర్ ఆసరా క్రింద రూ 6.82 కోట్లు విలువ చేసే మెగాచెక్కును లబ్ధిదారులుకు ఎమ్మెల్యే ఆర్థర్ అందచేశారుఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల. శేషన్న , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , జెడ్పీటీసీ పుల్యాల దివ్య , ఎంపీపీ మల్లేశ్వరి , వైసీపీ జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు సగినేల వెంకటరమణ , మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి , మండల కన్వీనర్ జి. చిట్టి రెడ్డి , మండల తహసిల్దార్ భారతి , మండల అభివృద్ధి అధికారి వెంకటరమణ ,మండల వైద్యాధికారి సుభాన్ , ఏపిఎం శ్రీనివాసులు , మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, తదితరులు పాల్గొన్నారు.