భార్య మరణ వాంగ్మూలం సాక్ష్యమే.. కానీ షరతులు వర్తిస్తాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : భర్త పెట్టిన హింసలపై భార్య ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీలోని సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టినప్పుడు దీన్ని సాక్ష్యంగా స్వీకరించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకటోది…మరణానికి కారణాలు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దీన్ని సాక్ష్యంగా పరిశీలించవచ్చని తెలిపింది. రెండోది… మరణానికి దారి తీసిన పరిస్థితులన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్న అనంతరం దీన్ని సాక్ష్యంగా భావించవచ్చని పేర్కొంది. అన్ని కేసులకూ ఒకే విధమైన నిబంధనలు పాటించాలని చెప్పడం సాధ్యం కాదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.