విజేతలకు.. అభినందన
1 min read
నేషనల్ లెవల్ మేనేజ్ మెంట్ పోటీలో జి.పుల్లయ్య విద్యార్థుల ప్రతిభ
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్ జి యం ఇంజనీరింగ్ కాలేజీ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ బుధవారం నిర్వహించారు. ఈ నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్ పోటీలకు జి. పుల్లయ్య కాలేజీ ఎంబీఏ విద్యార్థులు హాజరయ్యి తమ ప్రతిభను చాటి పోటీలలో బహుమతులు కైవసం చేసుకున్నారు. గురువారం పుల్లయ్య కాలేజీ మేనేజ్మెంట్ వారు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ అభినందన సభలో ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ మరియు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ సి. నాగ గణేష్ పాల్గొన్నారు. నిర్వహించిన పోటీలలో ఫైనాన్స్, హెచ్ ఆర్ యంగ్ మేనేజర్ విభాగంలో మొదటిబహుమతులు, బిజినెస్ క్విజ్ విభాగంలో మొదటి రెండు బహుమతులు మరియు మార్కెటింగ్ విభాగంలో రెండో బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో ఎంబీఏ చదువుతున్న మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తూ. ఎంబీఏ విద్యార్థులు ఇలాంటి నేషనల్ లెవెల్ మేనేజ్మెంట్ మీట్లో పాల్గొని బహుమతులు సంపాదించి కాలేజీకి పేరు తీస్తున్నారని, పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగి మానసికంగా దృఢం కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలలో ఇంకెన్నో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని తెలియజేశారు. ఈ అభినందన సభలో విభాగాధిపతి డాక్టర్ సీ.నాగ గణేష్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.