PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్ చేసిన మహిళ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఓ మహిళ వీడియో కాల్ చేసి దుస్తులు విప్పేయడంతో ఆయన బెంబేలెత్తిపోయారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. తిప్పారెడ్డి చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 75 ఏళ్ల తిప్పారెడ్డి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, అక్టోబరు 31 సాయంత్రం ఓ మహిళ ఆయనకు వీడియో కాల్ చేసింది. ఆయన మాట్లాడుతుండగానే ఆమె దుస్తులు విప్పేయడం ప్రారంభించింది. దాంతో ఆయన కాల్ కట్ చేశారు. అయినప్పటికీ ఆమె, ఆ తర్వాత ఓ అసభ్య వీడియోను ఎమ్మెల్యే ఫోన్ కు పంపింది. ఈ మేరకు తిప్పారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

About Author