ఎమ్మెల్యేను బూతులు తిట్టిన మహిళ !
1 min read
పల్లెవెలుగువెబ్ : శ‌్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణకు నిరసన సెగ ఎదరైంది. శెట్టిపల్లితండాలో ‘గడపగడప’లో ఎమ్మెల్యే శంకరనారాయణ పాల్గొన్నారు. 11 నెలలుగా పెన్షన్ రాలేదని ఎమ్మెల్యేను గిరిజన మహిళ నిలదీసింది. ఎమ్మెల్యే శంకరనారాయణ పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో బూతులతో గిరిజన మహిళ విరుచుకుపడింది. దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడప కార్యక్రమాల్లో చేపడుతున్న విషయం తెలిసిందే.